అనతి కాలంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది మైత్రీ మూవీస్. ఇప్పుడు ఈ సంస్థ చేతిలో పది సినిమాలున్నాయి. దాదాపుగా ప్రతీ హీరోకీ, ప్రతీ దర్శకుడికీ అడ్వాన్సులు ఇచ్చేసింది మైత్రీ. ఆ ఆఫీసులో ఒకేసారి నాలుగు సినిమాలకు సంబంధించిన పనులు చకచక సాగుతుంటాయి. ఇప్పుడు ఈ సంస్థ బాలీవుడ్‌కి వెళ్లబోతోందని టాక్. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయబోతోంది. ఇది త్రిభాషా చిత్రమని టాక్. బాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు విజయ్‌తో పనిచేయనున్నాడని సమాచారం. ఇప్పటికే… ఈ దర్శకుడు మైత్రీ మూవీస్ ఆఫీసులోనే సినిమాకి సంబంధించిన పనుల్ని కూడా మొదలెట్టేశాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. తెలుగులో సినిమా చేసి, మిగిలిన భాషల్లో డబ్ చేయడం లాంటి చీప్ ట్రిక్స్‌కి వెళ్లకుండా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడుసార్లు మూడు టేకులు.. అన్న ప్రాతిపదికతో ఈ సినిమా పూర్తి చేస్తారట. మొత్తానికి మైత్రీ తనమూలాల్ని విస్తరించుకోవడం మొదలెట్టింది. బాలీవుడ్లో ఏ స్థాయిలో విజయకేతనం ఎగరేస్తుందో చూడాలి.