ధమాకాతో తన ఖాతాలో మరో హిట్టు వేసుకొన్నాడు నక్కిన త్రినాథరావు. తొలి రోజు యావరేజ్ టాక్ తో మొదలైనా.. మెల్లగా ‘ధమాకా’ హిట్ సినిమాగా టర్న్ తీసుకోవడం నక్కిన అదృష్టమే. ధమాకా కమర్షియల్గా హిట్టవ్వడంతో… ఈ దర్శకుడిపై హీరోలు, నిర్మాతలు దృష్టి సారించారు. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ నక్కిన చేతిలో అడ్వాన్స్ కూడా పెట్టినట్టు టాక్. నక్కిన తదుపరి సినిమా మైత్రీలోనే ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని నక్కిన ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తున్నాడు. వెంకీ కోసం కొన్ని కథలు కూడా సిద్ధం చేశాడు. కానీ ఎందువల్లో ఇప్పటి వరకూ వర్కవుట్ అవ్వలేదు. ‘ధమాకా’ హిట్టవ్వడం.. మైత్రీ మూవీస్ నక్కిన తో సినిమా చేయడానికి ముందుకు రావడం… నక్కిన త్రినాథరావుకి కలిసొచ్చే అంశాలు. చేతిలో మైత్రీ ఉంది కాబట్టి.. వెంకీ కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సుంది. ఇది వరకే నక్కిన త్రినాథరావు వెంకీకి కథ వినిపించేశాడు. ఇక కాల్ తీసుకోవాల్సింది వెంకీనే. ఇటీవల ‘హిట్’ దర్శకుడు శైలేష్ కథకు పచ్చజెండా ఊపాడు వెంకీ. ఇప్పుడు నక్కిన ప్రాజెక్టు కూడా దాదాపుగా ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.