ఫ్లాపుల్లో ఉన్నా – చెక్కు చెదరని ఇమేజ్ పవన్ సొంతం. సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరగడమే గానీ తగ్గడం ఉండదు. తాజాగా వకీల్ సాబ్ కి రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలొచ్చాయి. ఆ సినిమాకి పవన్ ఇచ్చిన కాల్షీట్లు చాలా తక్కువ. అయినా సరే… 50 కోట్లు ఇచ్చాడంటే దిల్ రాజుకి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకమే. వకీల్ సాబ్ – చేసిన బిజినెస్ తో అది నిజమని నిరూపితమైంది కూడా.
ఇప్పుడు మైత్రీ మూవీస్ లో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకుడు. ఈసినిమా కోసం పవన్ కి రూ.60 కోట్ల పారితోషికం ఇస్తున్నార్ట. అంటే.. పవన్ పారితోషికాన్ని మైత్రీ మరో పది కోట్లకు పెంచినట్టే. కాకపోతే… వకీల్ సాబ్ తో పోలిస్తే.. ఈ సినిమాకి పవన్ ఇంకొన్ని ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి వస్తుంది. పవన్ మాత్రం ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హరీష్ కి హుకూం జారీ చేశాడట. ఎందుకంటే పవన్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటినీ పూర్తి చేయాలి కదా. హరీష్ మామూలుగానే మహా స్పీడు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయిపోయింది కూడా. పవన్ అండదండలుంటే ఈ సినిమానీ చకచక అవ్వగొట్టేస్తాడు.