అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు శ్రీనువైట్ల. ఆయన ఏ కథ ముట్టుకున్నా, ఎలాంటి హీరోని తెచ్చుకున్నా… ఫ్లాపు మాత్రం వదలడం లేదు. మిస్టర్ తరవాత… ఏదోలా రవితేజని పట్టుకోగలిగాడు. ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా తీయడానికి మైత్రీ మూవీస్ ముందుకు వచ్చింది. మైత్రీ మూవీస్ సినిమాలన్నీ కథాబలం ఉన్నవే. అలాంటి సంస్థ శ్రీనువైట్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యిందంటే… కచ్చితంగా ఆ సినిమాపై హోప్స్ పెట్టుకోవొచ్చు. కానీ.. ఈ సినిమా నుంచి మైత్రీ మూవీస్ తప్పుకోవాలని ఆలోచిస్తోందని, శ్రీనువైట్లకు హ్యాండిచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. ఈ సినిమా ఉండదేమో అంటూ…. గాసిప్పులు వండి వార్చాయి. కానీ. ఈ కాంబినేషన్‌కి వచ్చిన ముప్పేమీ లేదు. మైత్రీ మూవీస్ ఈ సినిమా నుంచి తప్పుకోలేదు. రవితేజ – శ్రీనువైట్లకు మైత్రీ ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కథ ప్రకారం అమెరికాలో షూటింగ్ జరుపుకోవాల్సివుంది. అందుకోసం వీసాలు సంప్రదించాలి. ప్రస్తుతం చిత్రబృందం ఆ పనుల్లో నిమగ్నమై ఉంది. వీసాల విషయంలో క్లారిటీ వచ్చేస్తే.. ఈ సినిమాకి లైన్ క్లియర్ అయిపోయినట్టే.