సినిమా నిర్మాణ రంగంలో ఎప్పుడు ఒకరి హవానే కొనసాగదు. హీరోల గురించి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిర్మాణ సంస్థలు భలే పుంజుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు మూవీ చేసిన మైత్రిమూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని, వి. రవి శంకర్, సి.వి.మోహన్ లు భారీ సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ ప్రొడ్యూస్ చేస్తున్న వీరు తర్వాత మెగా పవర్ స్టార్ సినిమా నిర్మించనున్నారట.
చరణ్ ప్రస్తుతం నటిస్తున్న తని ఒరువన్ రీమేక్ ధృవ పూర్తవగానే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే సుక్కు, చెర్రిల సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారట. నాన్నకు ప్రేమతో సక్సెస్ కొట్టిన సుకుమార్ రామ్ చరణ్ తో ఓ డిఫరెంట్ లవ్ సబ్జెక్ట్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుందని చెబుతున్నారు. మరి వరుసెంట స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించడమే కాదు వాటిని సూపర్ హిట్ చేసేలా వ్యూహ రచన చేస్తున్న మైత్రి మూవీస్ మరిన్ని సినిమాలు చేయాలని.. చేసే సినిమాలన్ని భారీ విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.