నేనొక్కడినే, ఆగడు తరువాత మహేష్ బాబు, ధృవ ను పక్కన పెడితే, బ్రూస్ లీ తరువాత రామ్ చరణ్ మైత్రీ మూవీస్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు వరుస ఫ్లాప్ ల తరువాత రవితేజ అదే బ్యానర్ లో చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ పరిస్థితి చెప్పనక్కరలేదు. అతగాడు ఆ యూనిట్ లోకే వచ్చాడు. ఇక యద్దం శరణంతో, హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న నాగ్ చైతన్యతో సవ్యసాచి. విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి తరువాత ఒక్క హిట్ లేదు. టాక్సీవాలా, గీత గోవిందం సంగతి తెలియాల్సి వుంది. పవన్ తో అజ్ఖాతవాసి తరువాత, నాని తో కృష్ణార్జున యుద్ధణ తరువాత సినిమాలు వుండాల్సింది కానీ తప్పిపోయింది. లేదూ అంటే ఇదే లెగసీ కంటిన్యూ అయి వుండేది.
మైత్రీ మూవీస్ చకచకా మాంచి డైరక్టర్లను బ్లాక్ చేస్తోంది. కానీ వాళ్లకు హీరోలుగా మాత్రం హిట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి హీరోలు హిట్ సినిమా కోసం అడిగి మరీ మైత్రీ దగ్గరకు వెళ్లి సినిమాలు చేస్తున్నారా? లేక ఫ్లాప్ లైన్ లో వున్న హీరోలు అయితే వెంటనే డేట్ లు ఇస్తారని మైత్రీ వాళ్ల దగ్గరకు వెళ్తోందా? అన్నది వాళ్లకే తెలియాలి.
అన్నట్లు డైరక్టర్లుగా చూసుకున్నా కూడా కొంత వరకు అదే తరహా కొనసాగుతోంది. సంతోష్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, సుకుమార్ లకు అలాగే చాన్స్ లు వచ్చాయి.