పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ గురించీ, కథాంశం గురించీ పలు గాసిప్పులు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో ఏది నిజమో, ఏది కాదో… తెలియని సందిగ్థంలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. దాంతో మైత్రీ మూవీస్ రంగంలోకి దిగింది. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఈ ఉగాదికి టైటిల్ ని, ఫస్ట్ లుక్‌నీ వదులుదామనుకున్నామని, అయితే… పరిస్థితులు అనుకూలించలేదని, ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని, ఈ సినిమా టైటిల్ ని ఓ శుభముహూర్తాన్న ప్రకటిస్తామని, కచ్చితంగా పవన్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తామని మైత్రీ ట్వీట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని హరీష్ ఇది వరకే పూర్తి చేశాడు. పవన్‌తో ఓకే అనిపించుకున్నాడు. షూటింగ్ ఎప్పుడు మొదలెట్టినా.. రంగంలోకి దిగడానికి హరీష్సిద్ధంగా ఉన్నాడు. క్రిష్ సినిమాని సైతం పక్కన పెట్టి, హరీష్ సినిమాని పవన్ ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయని కూడా వార్తలొస్తున్నాయి. మరి… ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
#PSPK28 Update
PowerStar @PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/rgEZj0gtLL
— BA Raju's Team (@baraju_SuperHit) June 8, 2021