అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం రావడంతో మరోసారి `పుష్ప` సినిమా వార్తల్లోకి నిలిచింది. పుష్ప సమయంలో బన్నీ ఎంత కష్టపడ్డాడో? ఆ సినిమా అప్పట్లో సృష్టించిన హంగామా మరోసారి చర్చల్లోకి వచ్చింది. దాంతో పాటు పుష్ప 2 అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అనే ప్రశ్న మొదలైంది. పుష్ప 2 షూటింగ్ గప్ చుప్‌గా సాగిపోతోంది. ఓ చిన్న వీడియో గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. ఆ తరవాత మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు పుష్ప 2 గురించిన ఓ ఆసక్తికకమైన అప్ డేట్ రాబోతోంది. ఈవారంలోనే మైత్రీ మూవీస్ పుష్ప 2కి సంబంధించిన ఆ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టబోతోంది. ఈ విషయమై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి తెలుగు 360కి ఓ అప్ డేట్ ఇచ్చారు. ”పుష్ప 1కి మించి పుష్ప 2 ఉండబోతోంది. సుకుమార్ అందర్నీ సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఈవారంలో ఇవ్వబోతున్నాం” అని హింట్ ఇచ్చారు. ఆ అప్డేట్ రిలీజ్ గురించే అయ్యుంటుందని టాక్. 2024 మార్చిలో పుష్ప 2ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2024 వేసవి సీజన్లో విడుదల కాబోయే తొలి భారీ సినిమాగా పుష్ప 2 ఉండాలన్నది ప్లాన్.