జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఎన్ శ్రీనివాసన్, ఆయన కంపెనీ ఇండియా సిమెంట్స్ ను అమ్మేసుకున్నారు. అల్ట్రాటెక్ కంపెనీ మెజార్టీ వాటాలను కొనుగోలు చేసి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది. చైర్మన్ స్థానంతో పాటు డైరక్టర్ల స్థానంలో ఉన్న శ్రీనివాసన్ కుటుంబసభ్యులంతా డైరక్టర్ స్థానాల నుంచి వైదొలిగారు. ఇండియా సిమెంట్స్ ను కూడా జగన్ వదల్లేదు.
కడప జిల్లాలో ఉన్న ప్లాంట్ కోసం నీళ్లు, గనులు కేటాయించేందుకు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. ఆయన వద్ద నుంచి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఆ కేసులు వెంటబడటంతో ఆయన కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సాధారణంగా తన వ్యాపారానికి పోటీ వస్తుందని అనుకున్న కంపెనీలకు ఎవరైనా పెట్టుబడి పెడతారా?. ఆయన పెట్టారు. జగన్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ఆయన పెట్టుబడి పెట్టారు. ఉత్పత్తి లేని కంపెనీ షేర్లను కోట్లు పెట్టి కొన్నారు. దానికి ప్రతిఫలం పొందారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ సంబంధాలు కొనసాగాయి. శ్రీనివాసన్ కు చెన్నై ఐపీఎల్ టీం ఉంది. 2023లో ఐపీఎల్ గెల్చిన తర్వాత శ్రీనివాసన్ కుమార్తె ఐపీఎల్ ట్రోఫితో అమరావతి వచ్చి జుగన్ ను కూడా కలిశారు. అక్రమాస్తుల కేసులో ఉన్న ఆ కంపెనీ ఇప్పుడు చేతులు మారిపోయింది.