ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి సుదీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణల ”సమ్మోహనం”. రెండు కళ్యాణ్ రామ్, తమన్నా నటించిన ”నా నువ్వే”. ఈ రెండు కూడా క్లాస్ సినిమాలే. అలాగే రెండు కూడా ప్రేమకధలే. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ట్రైలర్స్ క్లాస్ ఆడియన్స్ ను ఆకర్షించాయి.
‘సమ్మోహనం’ సినిమా విషయానికి వస్తే.. సుదీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కలయికలో వస్తున్న తొలి సినిమా. మణిరత్నం చెలియాలో నటించిన అతిధిరావు ఈ సినిమాలో హీరోయిన్. క్లాస్ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి ఈ సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లోనే ఓ కధను రాసుకున్నాడు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఏవీ కనిపించనప్పటికీ గ్లామర్ ఇండస్ట్రీపై రాసుకున్న కధ కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది.
ఇక ”నా నువ్వే” పక్కా క్లాస్ సినిమా. కళ్యాణ్ రామ్, తమన్నాలే స్పెషల్ ఎట్రాక్షన్. ఎందుకంటే చిత్ర దర్శకుడు జయేంద్ర సినిమా తీసి చాలా కాలమైయింది. ఆయన చివరిగా తీసిన ‘180’ ప్రయోగాత్మక సినిమా అయినప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. దిని తర్వాత మళ్ళీ ఇప్పుడే మెగాఫోన్ పట్టారాయన. అయితే ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ వుంది. పీసీ శ్రీరామ్ కెమరా. బేసిగ్గా పీసీ ఒక సినిమా అంగీకరించారంటే అందులో ఎదో విషయం ఉటుందనే నమ్మకం. ఈ సినిమాకి ఆయన పని చేయడం ఒక ఎసెట్ అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం థియేటర్ లో వున్న రజనీకాంత్ ‘కాలా’ వేడి తగ్గిపోయింది. అటు క్లాస్ అటు మాస్ జనాలను వూపేస్తుందనుకున్న ‘కాలా’ ఏమంత ప్రభావం చూపలేకపోయింది. ప్రేక్షకులు మరో సినిమా కోసం చూసే పరిస్థితి. ఇలాంటి సమయంలో వస్తున్న ఈ రెండు క్లాస్ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.