మిలట్రీ మాధవరం… ఈ ఊరు పేరు విన్నారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని ఓ పల్లెటూరు ఇది. త్వరలో అల్లు అర్జున్ ఈ ఊరు వెళ్లబోతున్నాడు. బన్నీకీ ఆ ఊరుకి ఉన్న సంబంధం ఏమిటంటారా?? మిలటరీ మాధవరం పేరుకి తగ్గట్టే.. ఊరి యువతలో సగం మంది సైన్యంలో ఉన్నారట. ఉర్లో ప్రతీ ఒక్క కుటుంబానికీ మిలటరీ నేపథ్యం ఉంది. అందుకే ఆ ఊరికి ఆ పేరు పెట్టారు. నా పేరు సూర్య కూడా సైనిక శక్తిని నిరూపించే చిత్రమే. అందుకే.. ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఈ ఊర్లో చేయాలని చిత్రబృందం భావిస్తోంది. పాటల విడుదల కార్యక్రమం అక్కడ చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉన్నప్పటికీ.. పెద్ద స్థాయిలో కార్యక్రమం చేయడానికి అనుకూల వాతావరణం అక్కడ ఉండదని చిత్రబృందం వెనకడుగు వేసినట్టు సమాచారం. అందుకే కనీసం ఓ చిన్న ఈవెంట్ అయినా అక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు. ఆడియోని ఈనెల 15న విడుదల చేస్తారు. అయితే సభావేదిక ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించలేదు.