అల్లు అర్జున్‌కి తెలుగులోనే కాదు, మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు హిందీలోనూ బన్నీ సినిమాలు తెగ చూస్తున్నారు. అక్కడ బన్నీ సినిమాలు డబ్బింగ్ రూపంలో వెళ్తున్నాయి. సెట్ మ్యాక్స్‌లోనూ, యూ ట్యూబ్‌లోనూ బన్నీ సినిమాల్ని బాగా చూస్తున్నారు. ఇటీవల `డీజే` యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అందుకే బన్నీ సినిమా అంటే హిందీ డబ్బింగ్ రైట్స్ కోట్లలో పలుకుతోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’కీ అదే స్థాయిలో గిరాకీ ఏర్పడింది. దీన్ని ఏకంగా రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది ఓ సంస్థ. అయితే ఈ డీల్ టీజర్ విడుదలకు ముందే జరిగిపోయింది. అప్పటికి రూ.12 కోట్లంటే పెద్ద డీల్. ఇప్పుడు ఈ సినిమా కొనడానికి ఓ సంస్థ దాదాపు రూ.18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందట. అయితే అప్పటికే రూ.12 కోట్లకి డీల్ సెట్టవ్వడంతో నిర్మాతలు తెగ బాధపడుతున్నారు. ముందే అమ్ముకుని రూ.6 కోట్లు నష్టపోయిందుకు బాధ పడాలో, ‘నాపేరు సూర్య’కి ఈ స్థాయిలో మార్కెట్ పెరిగినందుకు సంతోషించాలో నిర్మాతలకు అర్థం కావడం లేదు. కాకపోతే ఒకటి.. బన్నీ మార్కెట్ రోజు రోజుకీ పెరుగుతోంది. అందుకే… బన్నీ గ్యాంగ్ ఈ విషయంలో తెగ సంతోషపడిపోతోంది.