అల్లు అర్జున్ సరికొత్త మార్క్ ను సెట్ చేశాడు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ శాటిలైట్, డిజిటల్ ఫిగర్స్ ని టచ్ చేశాడు. బన్నీ లేటెస్ట్ చిత్రం ‘నా పేరు సూర్య’ . వక్కంతం వంశీ దర్శకత్వం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రేటు. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 15 కోట్లను చెల్లించి జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇక ఇతర భాషల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తం రూ 24. 7 కోట్ల భారీ మొత్తానికి వెళ్లినట్లు తెలిసింది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించింది. తొలి 24 గంటల్లోనే ఆన్లైన్లో కోటికిపైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో ఆ వ్యూస్ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు ఆ క్రేజ్ కు తగ్గట్టే ఈ సినిమాకు ఏకంగా రూ 24. 7కకోట్లు కేవలం శాటిలైట్, డిజిటల్ రూపంలో రావడం విశేషం. వక్కంతం వంశీ దర్శకుడి పరిచయం అవుతున్న తొలి సినిమాతోనే ఇలా శాటిలైట్ పరంగా రికార్డ్ సృష్టించడం మరో విశేషం