సోషల్ మీడియాలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కేరళలోనూ అభిమానులు ఉన్నారు కదా, ఆ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంటుంది. ఇటీవల అల్లు అర్జున్ నుంచి వచ్చిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’కి వచ్చిన డిజిటల్ వ్యూస్ ఇందుకు నిదర్శనం. తొలి 29 గంటల్లోనే కోటి వ్యూస్ సాధించింది బన్నీ సినిమా. బాహుబలి తరవాత.. ఇదే రికార్డు. బాహుబలి కోటి వ్యూస్ కేవలం 23 గంటల్లోనే సాధిస్తే… బన్నీ కి 29 గంటలు పట్టింది. సౌత్ ఇండియాలో మొత్తంగా చూస్తే.. బన్నీ సినిమాకి మూడో స్థానం. రెండో ప్లేస్లో విజయ్ సినిమా మెర్శల్ ఉంది.
గతంలో సరైనోడు, డిజె చిత్రాలు కూడా యూట్యూబ్ లో రికార్డ్ గా నిలిచాయి. సరైనోడు ఫాస్ట్ 118 మిలియన్స్ , డిజె చిత్రం నెల రోజుల్లో 84 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బన్నీ అభిమాన గణం గురించి పక్కన పెడితే.. ఓవరాల్ గా చూసినా.. ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ అదిరిపోయింది. చూసినవాళ్లంతా… ‘ఇదేదో బాగుందే’ అన్నవాళ్లే. ఈమధ్య కాలంలో ముక్తకంఠంతో అందరూ `బాగుంది` అని చెప్పిన ఫస్ట్ లుక్ టీజర్ ఇదే. అందుకే అన్ని వ్యూస్ వచ్చాయి.