ట్రైలర్లో ఓ డైలాగ్ వుంది… ‘క్యారెక్టర్ని వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాక ముందు చచ్చిపోవడమే’ అని. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో హీరో క్యారెక్టరైజేషన్ వివరించడానికి ఈ ఒక్క డైలాగ్ చాలనుకుంట! ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో హీరోకి కోపం ఎక్కువనే విషయాన్ని రివీల్ చేశారు. ట్రైలర్లో ఆ కోపాన్ని కంటిన్యూ చేశారు. సైనికుడు సూర్యగా అల్లు అర్జున్ ఎక్కడా క్యారెక్టర్ని వదల్లేదు. సైన్యంలో మాత్రమే కాదు… ప్రేమలోనూ అదే కోపాన్ని, ఇంటెన్సిటీని చూపించాడు. కొత్తదనం లేదు. కాకపోతే.. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్లో మిగతా పాత్రలను ఎక్కువ ప్రాజెక్ట్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. తమిళ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రొఫెసర్ పాత్రలో, హిందీ నటుడు బొమన్ ఇరానీ ఆర్మీ అధికారిగా కనిపించారు. విలన్‌గా శరత్ కుమార్ గెటప్, యాక్టింగ్ బాగున్నాయి. దేశం కోసం ఏది చేయడానికైనా ముందడుగు వేసే సైనికుడిగా అల్లు అర్జున్ చేసిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చేలా వున్నాయి. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ… లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.