‘మాస్ జాతర మొదలు’ అంటూ నాగార్జున ‘నా సామిరంగ’ టీజర్ వచ్చింది. అల్లరి నరేష్ డైలాగులతో నాగార్జున పాత్రని మాస్ అవతార్ లో పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైయింది. మావిడి తోటలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ తో నాగార్జున తెరపైకి వచ్చారు.
‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా కొంచెం తగ్గమను’ అనే డైలాగ్ తో ‘నా సామిరంగ’ రొమాంటిక్ యాంగిల్ ని తెరపైకి తెచ్చారు. ఆశికా రంగనాథ్ తో నాగ్ కెమిస్ట్రీ కాస్త కొత్తగానే వుంది. టీజర్ లో అల్లరి నరేష్ కి కొంచెం ఎక్కువ స్పెప్ దొరికింది. రాజ్ తరుణ్ కూడా ఓ డైలాగ్ వినిపించాడు.
నాగార్జున క్యారెక్టర్ కూల్ గా అదే సమయంలో వైల్డ్ గా వుంది. టీజర్ లో యాక్షన్ కి పెద్దపీట వేశారు. కొత్త దర్శకుడు బిన్నీ ట్రీట్మెంట్ లో కొత్తదనం కనిపించింది. కీరవాణి నేపధ్య సంగీతం బావుంది. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే అంశాలతో టీజర్ బాగానే అలరించింది. మరి నాగ్ సంక్రాంతి జాతర ఎలా వుంటుందో చూడాలి.