రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు జనాల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు మూడో గీతంగా ‘నానా హైరానా’ విడుదలైయింది. తమన్ ఈ పాట కోసం బ్యూటీఫుల్ మెలోడీ చేశాడు. కార్తిక్, శ్రేయా ఘోషల్ వాయిస్ లు మెలోడీని మరింత మృదువుగా మార్చాయి.
రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంలా మెరిశా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోడ్నయ్యా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే.. పల్లవిలోని ఈ పదాల్లో చక్కని భావుకత వినిపించింది.
గగనాలన్నీ పూల గొడుగులు
భువనాలన్నీ పాలమడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయను పవనములు
ఎవరే ఎవరూ లేని దీవులు నీకు నాకేనా
రోమాలన్ని నేడు మన ప్రేమకు జండాలాయే
ఏ మాయ మరి ఏమో నర నరము నైలు నదాయే
రోమాలన్ని నేడు మన ప్రేమకు జండాలాయే..
చరణంలో రాసిన ఈ మాటల్లో అందమైన రొమాన్స్ దాగుంది. శంకర్ విజువల్ కి ఏ మాత్రం తగ్గని లిరిక్స్ ఇవి. ముఖ్యంగా రోమాలు ప్రేమకు జెండాలు అవ్వడం, నరాలు నైలు నదిగా మారడం… ఆస్వాదించే మనసుండాలే గానీ గొప్ప రొమాన్సిజం దాగున్న లిరిక్స్ కుదిరాయి.
సాంగ్ లో విలువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. రామ్ చరణ్, కియారా అడ్వాణీ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. కొత్త టెక్నాలజీ సాయంతో సాంగ్ ని చిత్రీకరించారు. ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో వుంటుందో చూడాలనే క్యురియాసిటీ కలిగించింది.