ఆస్కార్ 2024లో ఈసారి భారతీయ సినిమాకు రిక్త హస్తాలే మిగిలాయి. అసలు పోటీలో భారతీయ చిత్రాల ప్రస్తావనే లేదు. అయినా సరే.. ‘నాటు నాటు’ పాట రూపంలో మనకు కాస్త ఊరట లభించింది. 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటిగిరీలో నిలిచి.. ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది ‘నాటు నాటు’ పాట. ఆ విజయంతో కోట్లాది భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. ఆస్కార్ వేదికపై ఈసారి కూడా ‘నాటు నాటు’ పాట ప్లే అయ్యింది. 2024 సంవత్సరానికి గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటరిరీలో అవార్డు ప్రకటిస్తున్నప్పుడు ఆస్కార్ వేదిక బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్, చరణ్ వేసిన ‘నాటు నాటు’ హుక్ స్టెప్ విజువల్స్ కనిపించాయి. సాధారణంగా ఏ అవార్డు ఇచ్చినా, నామినీల వివరాలతో పాటుగా, గతేడాది ఆ కేటగిరిలో అవార్డు పొందిన సినిమా తాలుకూ విజువల్స్ ప్లే చేయడం పరిపాటి. అలా… ‘నాటు నాటు’ పాటని మరోసారి ఆస్కార్ వేదికపై చూసుకొనే అవకాశం దక్కింది.
2024 ఆస్కార్ వేదికపై ‘ఓపెన్ హైమర్’ తన ఆధిపత్యాన్ని చూపించింది. ఏకంగా 7 అవార్డులు దక్కించుకొంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ.. ఈ విభాగాల్లో `ఓపెన్ హైమర్` అవార్డులు దక్కించుకొంది. ‘పూర్ థింగ్స్’కి మూడు ఆస్కార్లు లభించాయి.