తెలుగు పాట చరిత్ర సృష్టించింది. ఆస్కార్ గెలుచుకొంది. ఆర్.ఆర్.ఆర్లోని `నాటు.. నాటు` పాటకు ఆస్కార్ పురస్కారం దక్కేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకొంది. ఈ విభాగంలో.. అప్లాజ్, లిఫ్ట్ మి అప్, దిస్ ఈజ్ ఏ లైఫ్, హోల్డ్ మై హ్యాండ్ పాటల్ని అధిగమించి…. నాటు.. నాటు ఆస్కార్ అందుకొంది. కీరవాణి స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లిజంగ్, కాలభైరవ ఆలపించిన సంగతి తెలిసిందే. చంద్రబోస్రాసిన ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం దక్కించుకొంది. ఇప్పుడు ఏకంగా ఆస్కారే వరించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటించిన వెంటనే… డాల్డీ స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఈ పాటకు ఆస్కార్ వస్తుందని భారతీయులే కాదు… హాలీవుడ్ కూడా నమ్మింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా.. నాటు నాటు పాట గురించే చర్చ జరిగింది. దానికి తోడు… రాజమౌళి టీమ్ కూడా ఈ పాటకి భారీ ఎత్తున ప్రచారం కల్పించారు. దేశం మొత్తం ఈ పాటకు అవార్డు రావాలని కోరుకొంది. ఇప్పుడు అనుకొన్నట్టే జరిగింది. కోట్లాది ప్రజల ఆశ, ఆకాంక్ష నెరవేరింది. నాటు నాటుకు పురస్కారం దక్కింది. ఇంతకంటే ఏం కావాలి…? ఈ ఖ్యాతి దక్కించుకొన్న తొలి భారతీయ చిత్రం ఇదే. జయహో… ఆర్.ఆర్.ఆర్, జయహో రాజమౌళి.