వయసు దాచడం కథానాయికల ప్రధమ లక్షణం. మీ వయసెంత అంటే.. ముసి ముసిగా నవ్వుతారు తప్ప. చెప్పరు. ఆస్తిపాస్తుల చిట్టా అయినా విప్పుతారేమో గానీ, వయసు వివరాలు మాత్రం అస్సలు బయటపెట్టరు. నభా నటేషా కూడా అదే చేస్తోంది. ఆ మాట కొస్తే.. వయసు బాగా తగ్గించేసి మరీ చెబుతోంది. వికీ పీడియాలో నభా నటేషా వయసు 23 ఏళ్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నభా నటేషా. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. అయితే నభా వయసు ఇప్పడు 29 ఏళ్లని, కావాలని వయసు తగ్గించి చెప్పుకుంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరీ 29 ఏళ్లంటే యువ హీరోల పక్కన అవకాశాలు రావని, అందుకే ఆరేళ్లు తగ్గించుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది నభా. ఆ సినిమాకి ఛార్మి నిర్మాత. ఛార్మి ఇచ్చిన సలహా ప్రకారమే.. వికీ పీడియాలో వయసు మార్చుకుందని తెలుస్తోంది. నభా మంగళూరులో ఇంజనీరింగ్ చదువుకుంది. ఇంజనీరింగ్ పూర్తయిన తరవాతే… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని చెబుతున్నారు. 19 ఏళ్లకు ఎలాగూ ఇంజనీరింగ్ పూర్తవ్వదు. 24 ఏళ్లకు నభా సినిమాల్లోకి వచ్చిందని, ఆ లెక్కన తన వయసు 29 ఏళ్లని.. నభాతో పనిచేసినవాళ్లు కూడా చెబుతున్నారు.