నాగచైతన్య `లవ్ స్టోరీ`తో బిజీగా ఉన్నాడు. మరోవైపు `థ్యాంక్యూ` కూడా పట్టాలెక్కుతోంది. అక్కినేని కుటుంబానికి `మనం`లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. విక్రమ్‌కి అచ్చొచ్చిన పి.సీ. శ్రీరామ్ ఛాయాగ్రహకుడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లున్నారు. ప్రియాంక మోహన్, మాళవిక నాయర్ లాంటి వాళ్ల పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఓ కథానాయికగా నభా నటేషా ఫిక్సయిపోయింది. ఇటీవల ఈ సినిమాపై నభా సంతకాలు చేసేసింది. విక్రమ్ కె.కుమార్ కథల్లో కథానాయిక పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లకూ కీలకమైన పాత్రలే దక్కాయని తెలుస్తోంది. ఇటీవల `సోలో బతుకే సో బెటరు` సినిమాలో నభా.. అలరించింది. ఈ సినిమా కాకుండా.. మరో రెండు ప్రాజెక్టులపై నభా సంతకాలు చేసినట్టు టాక్.