జనసేన పార్టీ ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. ఓ వైపు.. సాక్షాత్తూ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా గెలవలేని… ఫలితం… మనోవేదనకు గురి చేస్తూండగా… భవిష్యత్‌పై.. ఎవరికీ నమ్మకం లేనట్లుగా.. ఆ పార్టీలో నేతలు వ్యవహరించడం ప్రారంభించారు. ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోయే వాళ్ల జాబితాలో తాజాగా… వినిపిస్తున్న పేరు నాదెండ్ల మనోహర్. అందుకే.. ఈ సారి జనసేన షేకయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
నాదెండ్ల మనోహర్ ఎక్కడున్నారు…?
ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్.. ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. ఆయన… తెనాలిలో ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తర్వాత.. ఆయన రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారని.. సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమయింది. అది నిజమో కాదో క్లారిటీ లేదు కానీ .. ఇటీవలి కాలంలో.. జనసేన కార్యక్రమాల్లో… నాదెండ్ల మాత్రం కనిపించడం లేదు. గుంటూరు జిల్లా సమీక్షకు ఆయన హాజరు కాలేదు. దాంతో రూమర్స్ మరింత పెరిగిపోయాయి.
నాదెండ్ల నుంచి కాదు.. జనసేన నుంచి ఖండన ప్రకటన..!
నాదెండ్ల మనోహర్ పార్టీ మారబోతున్నారని జరిగిన ప్రచారంపై… ఆయన మాత్రం స్పందించలేదు. కానీ జనసేన పార్టీ మాత్రం స్పందించింది. అదంతా అబద్దమని.. ఆయన పార్టీ మారబోరని ప్రకటించింది. నాదెండ్ల అమెరికా పర్యటనలో ఉన్నారని.. అందుకే… జిల్లా సమీక్షలకు హాజరు కాలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు .. స్వయంగా.. ఆ నేతనే.. ఖండన ప్రకటన విడుదల చేస్తారు. అదే చేస్తేనే కాస్త క్రెడిబులిటీ ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా.. ఆయన ఉంటున్నపార్టీనే అలాంటి ప్రకటన చేస్తే.. కాస్త సందేహించాల్సిన విషయమే. నాదెండ్ల విషయంలో అదే జరుగుతోంది.
జనసేనపై వలసలు ప్రభావం చూపుతాయా..?
ఎన్నికల ప్రకియ జరుగుతూండగానే.. ఓ అధికార ప్రతినిధి విజయ్ బాబు బీజేపీలో చేరిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత మరో అధికార ప్రతినిధి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత రావెల కిషోర్ టాటా చెప్పారు. చోటామోటా నేతలు.. కూడా గుడ్ బై చెబుతున్నారు. అయితే.. వీళ్లు వెళ్లిపోవడం వల్ల.. జనసేనకు వచ్చే నష్టం ఏమీ లేదనే భావన జనసైనికుల్లో ఉంది. ఎందుకంటే.. వారి సామర్థ్యం ఏమిటో అందరూ చూశారు కాబట్టి… పట్టించుకోమంటున్నారు. అయితే.. నాదెండ్ల గుడ్ బై చెబితే మాత్రం.. అది ఆ పార్టీకి షాక్ లాంటిదే. ఎందుకంటే… పార్టీలో చేరిన వెంటనే… నాదెండ్లకు పవన్ కల్యాణ్ పెద్ద పీట వేశారు. దాదాపుగా… పార్టీని అప్పగించేశారు. టిక్కెట్లు సహా.. నిర్ణయాలు మొత్తం ఆయనే తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లారు. అలాంటి ప్రాధాన్యత దక్కించుకున్న నేత వెళ్లిపోతే..జనసేనకు.. పవన్ కల్యాణ్‌కు షాకే..!