వైసీపీ ప్రభుత్వం అవినీతి, స్కాములు గురించి బయటకు తెలిసింది గోరంత. కానీ లోతుగా చూస్తే ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని సొంతానికి ఎలా రాసుకుంటున్నారో.. ఎలా దోచుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి దోపిడీని రోజుకొకటి చొప్పున బయటపెడతానని చాలెంజ్ చేశారు. ఆ ప్రకారం బయట పెడుతున్నారు. రెండు రోజుల్లో స్కాముల గురించి ఆధారాలతో బయట పెట్టారు.
పిల్లలకు విద్యాకానుక పేరుతో బూట్లు, బ్యాగ్, డ్రెస్ క్లాత్ ఇస్తున్నారు. పిల్లలకు ఇచ్చేది కొంత అయితే .. నొక్కేది ఎంతో ఉందని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. పిల్లల పేరుతో రూ. 120 కోట్లు కొట్టేసినట్లుగా నాదెండ్ల మనోహర్ బయట పెట్టారు. ఢిల్లీలో ఈడీ కొన్ని కంపెనీలపై దాడులు చేసినప్పుడు ఇక్కడి కాంట్రాక్టుల గుట్టు బయటపడిందని.. త్వరలో ఈడీ ఇక్కడకూ వస్తుందని సంచలన విషయం బయట పెట్టారు. ఇక ఇండోసోల్ కంపెనీకి అప్పనంగా వేల ఎకరాలు కేటాయిస్తున్న వైనాన్ని రెండో రోజు బయట పెట్టారు. ఇండోసోల్ కంపెనీ జగన్ రెడ్డి బినామీ. అది ప్రారంభించి ఏడాది కూడా కాలేదు. అయినా వేల ఎకరాలుభూములు అప్పగిస్తున్నారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ భూముల్ని నేరుగా సేల్ డీడ్ చేస్తున్నారు. ఇందు కోసం పారిశ్రామిక విధానాన్ని కూడా మార్చేశారు. అంటే సీఎం జగన్ రెడ్డి తన బినామీ కంపెనీ కి భూములు రాయించుకునేందుకు పారిశ్రమిక విధానం కూడా మార్చేశారన్నమాట. జగన్ రెడ్డి ప్రజలు అధికారం ఇచ్చింది.. ఆస్తులు కాపాడమని కానీ.. ఇలా అడ్డగోలుగా అమ్మేసుకోవడం లేదా తన సొంతానికి రాయించుకోవడానికి కాదన్న విమర్శలు ఉన్నాయి. కానీ అదే చేస్తున్నారు.
ముందు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల సంచలన స్కాములు బయట పెట్టనున్నారు. ప్రభుత్వం మారగానే వీటన్నింటిపై పక్కాగా కేసులు నమోదు చేయడం… అన్నింటినీ జగన్ రెడ్డితో పాటు అధికారుల్నీ ఎవర్నీ వదలకుండా బాధ్యుల్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో అసలు కథ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.