వైసీహీ హయాంలో రూ. 45 వేల కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేశారని ఇది అప్పటి సీఎం జగన్ కుమొత్తం తెలుసని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అసలు స్మగ్లింగ్ కోసమే రేషన్ వాహనాల స్కీం పెట్టారని స్పష్టం చేశారు. పవన్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందని స్పష్టంచేశారు.
వైసీపీ హయాంలో ఐదేళ్లు అక్రమంగా బియ్యం రవాణా చేశారని… కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామన్నారు.కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారు..గత ఐదేళ్లలో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ.. కొత్త పథకం మొదలుపెట్టింది. ఈ పథకం కేంద్రంగానే అక్రమ రవాణాకు తెరలేపారు. గ్రామాల్లో బియ్యం వద్దనేవారికి డబ్బులిచ్చారని.. అసలు తీసుకోని వాళ్ల బియ్యాన్ని దోచుకున్నారన్నారని తెలిపారు. ఇలా బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారని మనోహర్ తెలిపారు.
ఐదేళ్లలో కాకినాడ పోర్టునుంచి కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల.. బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు.. ఈ బియ్యం విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందని.. మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఇది జరగదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో మొత్తం గుట్టు బయటపడిందని.. అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.