సీఎం జగన్ మీ బిడ్డనంటూ సెంటిమెంట్ చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కామెడీ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు. గతంలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు… మామయ్యను అంటూ వరుసలు కలుపుకుని సెంటిమెంట్ పండించారు. ఇప్పుడు ఏకంగా అందరితో మీ బిడ్డనంటూ చెబుతున్నారు. అయితే ఇలా చెప్పుకున్న ప్రతీ సారి ఆయన కుటుంబం గురించి ప్రజల్లో చర్చకు వస్తోంది.
ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా గుర్తు చేసింది. మీ బిడ్డనంటూ బహిరంగసభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్లనే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబమూ తమ బిడ్డగా ఒప్పుకోదని ని మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని పదే పదే మీ బిడ్డ అని జగన్ ప్రసంగించడం ఆపాలని సలహా ఇచ్చారు.
తల్లి, చెల్లి విషయంలోనే కాదు.. కుటుంబం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తరచూ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. తండ్రిని చంపారంటూ.. తీవ్ర రోపణలు చేసి.. రిలయన్స్ పై దాడులు కూడా చేయించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రిలయన్స్ అధినేతను ఇంటికి పిలిచి.. విందు భేటీ ఇవ్వడమే కాకుండా.. రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మీ బిడ్డనంటూ ప్రజలకు కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసేన ప్రశ్నించినట్లుగా ఇంట్లో వాళ్లే నమ్మరు..ఇక బయట వాళ్లెలా .. ఈ బిడ్డను ఓన్ చేసుకుంటారన్నది అసలు అందరికీ వస్తున్న డౌట్ !