ఈ సంక్రాంతి ‘బంగార్రాజు’దే. తొలి మూడు రోజులూ మంచి వసూళ్లు తెచ్చుకుంది. సోమవారం కూడా వసూళ్ల హవా తగ్గలేదు. ఈ వసూళ్లు, అంకెలు నాగ్ ని సంతోషంలో ముంచెత్తాయి. ఆ ఆనందం.. రాజమండ్రి సక్సెస్ మీట్ లో కనిపించింది. ”నాకు వసూళ్లు ముఖ్యం కాదు… నా అభిమానుల సంతోషమే ముఖ్యం” అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు నాగ్. తను బంగార్రాజు కాదని, అసలైన బంగార్రాజు నాన్నగారే అని, ఆయన ఎక్కడున్నా.. ఆశీస్సులు అందిస్తూనే ఉంటారన్నారు నాగ్. ”ప్రపంచమంతా కరోనాకు భయపడిపోయింది. ఈ టైమ్ లో సినిమాలు విడుదల చేయొద్దన్నారు. నార్త్ లో సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. కానీ తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతోనే బంగార్రాజుని విడుదల చేశాను. మంగళవారం కూడా హౌస్ ఫుల్స్ నడుస్తున్నాయని విన్నాను. నాకు అంకెలు ముఖ్యం కాదు.. అభిమనమే ముఖ్యం ” అని చెప్పుకొచ్చారు నాగార్జున. నాగచైతన్యకూడా ఈ సినిమా విజయవంతం అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడ ఫంక్షన్ చేసినా, షూటింగ్ చేసినా, సినిమా హిట్టవ్వడం ఖాయమని, బంగార్రాజుతో ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యిందన్నాడు చైతూ.