‘క‌ల్కి’ పార్ట్ 2లో నాని, న‌వీన్ పొలిశెట్టి

‘క‌ల్కి’లో ప్ర‌భాస్‌, అమితాబ్‌, క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు చాలామంది హీరోలు చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిశారు. ఇటీవ‌ల వైజ‌యంతీ మూవీస్‌లో చేసిన అంద‌రు హీరోలో ఏదో ఓ పాత్ర‌లో ఇలా క‌నిపించి అలా మాయ‌మైపోయారు. ఒక్క నాని, న‌వీన్ పొలిశెట్టి త‌ప్ప‌. ‘క‌ల్కి’లో నాని కూడా ఉన్నాడ‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది. కానీ.. నాని మాత్రం క‌నిపించ‌లేదు. అయితే పార్ట్ 2లో నానితో పాటు న‌వీన్ పొలిశెట్టి కూడా ఉంటార‌ని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్‌. ”క‌ల్కిలో కామియోస్ ఎక్కువ‌గా ఉన్నాయి. వాటికి మంచి అప్లాజ్ వ‌స్తోంది. ఓ సినిమా చూస్తున్న‌ప్పుడు స‌డ‌న్ గా మ‌న‌కు తెలిసిన స్టార్ క‌నిపిస్తే ఆనందంగా ఉంటుంది. చిన్నదో పెద్ద‌దో వాళ్ల స్క్రీన్ ప్ర‌జెన్స్‌ను ఆస్వాదిస్తాం. ఆ ఉద్దేశంతోనే ‘క‌ల్కి’లో ఇన్ని పాత్ర‌ల్ని ప్ర‌వేశ పెట్టా. వైజయంతీ మూవీస్ సంస్థ‌లో ఇటీవ‌ల చేసిన హీరోలంద‌రూ తెర‌పై క‌నిపించారు. నాని, న‌వీన్ పొలిశెట్టిలు త‌ప్ప. ‘క‌ల్కి 2’లో ఎక్క‌డ కుదిరితే అక్క‌డ వాళ్ల‌ని పెట్టేస్తా” అన్నారు. ‘క‌ల్కి’లో ప్ర‌భాస్ పాత్ర ర‌న్ టైమ్ పై కొంత అసంతృప్తి ఉంది. ప్ర‌భాస్ ని గెస్ట్ రోల్ గా మార్చేశారని, స్క్రీన్ టైమ్ చాలా చిన్న‌దిగా ఉంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ బాగా ఫీల‌య్యారు. దీనిపై కూడా నాగ అశ్విన్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ”క‌ల్కి వ‌ర‌ల్డ్ ని బిల్డ్ చేయ‌డానికి కొంత టైమ్ ప‌ట్టింది. పైగా చాలా పాత్ర‌లున్నాయి. అందుకే ప్ర‌భాస్ పాత్ర నిడివి త‌గ్గింద‌ని అనిపించొచ్చు. పార్ట్ 2లో వ‌ర‌ల్డ్ బిల్డ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి.. స్ట్ర‌యిట్ గా నేను చెప్ప‌ద‌ల‌చుకొన్న పాయింట్ చెప్పొచ్చు. `క‌ల్కి`తో పోలిస్తే పార్ట్ 2లో ప్ర‌భాస్ పాత్ర నిడివి ఎక్కువ‌గా ఉంటుంద‌”న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close