ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇదో సైన్స్ ఫిక్షన్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ నవంబరు నుంచి డేట్లు ఇచ్చాడు. నవంబరులో 15 రోజులు డిసెంబరులో మరో 15 రోజులూ ప్రభాస్ పై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
అయితే అంతకు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేస్తారు. సీజీకి అధిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ముందు సీజీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ తరవాత.. ప్రభాస్ రాగానే ఆయా సన్నివేశాలకు మ్యాచ్ చేస్తారు. ప్రభాస్తో అవసరం లేని మేరకు వీలైనన్ని సీన్లు ముందే తీసేయాలని నాగ అశ్విన్ భావిస్తున్నాడు. ఈ సినిమా స్టెరాయిడ్స్ నేపథ్యంలో నడుస్తుందని కొన్ని వార్తలొస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదని తెలిసింది.