‘మహానటి’ విడుదలైన తరవాత… చిత్రబృందాన్ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు చిరంజీవి. అప్పుడే చిరంజీవి – నాగ్ అశ్విన్ కాంబో తెరపైకి వచ్చింది. చిరంజీవి కోసం తాను ఓ కథ సిద్ధం చేస్తున్నానని ఆ సందర్భంలోనే చెప్పేశారు నాగ అశ్విన్. అది ‘పాతాళ భైరవి’లాంటి సినిమా అని, మాంఛి సోషియో ఫాంటసీ అని హింట్ ఇచ్చారు చిరంజీవి. దాంతో ఈ కాంబోపై ఆసక్తి రేగింది.
‘కల్కి’ కథ ముందుగా చిరంజీవికే చెప్పారని, అయితే ఈ కథ తనకు సైట్ అవ్వదని, ప్రభాస్‌కి చేస్తే బాగుంటుందని, చిరు సలహా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ‘కల్కి’ కథకూ చిరంజీవికి సంబంధం లేదు. అసలు ఈ కథ చిరంజీవి వరకూ వెళ్లనేలేదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. మరి చిరంజీవి కథ ఏమైంది?
ఈ కథ అలానే ఉంది. వైజయంతీ మూవీస్ ఈ కథని వెండి తెరపై తీసుకొచ్చే ఆలోచనల్లో ఉంది. ‘కల్కి 2’ పూర్తయ్యేసరికి మరో రెండేళ్లు పడుతుంది. ఆ తరవాత చిరు కోసం రాసుకొన్న కథ తీసే అవకాశం ఉంది. అయితే అప్పుడు చిరు హీరో కాకపోవొచ్చు. అదే కథని రామ్ చరణ్‌తో తీసే ఛాన్స్ వుంది. ఎందుకంటే ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ తరవాత ఫాంటసీ కథల్లో నటించలేదన్న అసంతృప్తి చిరంజీవికి ఉంది. అది కాస్త ‘విశ్వంభర’లో తీరిపోతోంది. అందుకే ఈ జోనర్‌ని చిరు మళ్లీ ఇప్పట్లో టచ్ చేసే అవకాశం లేదు. కానీ చరణ్ ఇప్పటి వరకూ ఇలాంటి కథ చేయలేదు. కాబట్టి నాగ్ అశ్విన్ ఈ కథని చరణ్‌తో చేసే అవకాశాలే ఎక్కువని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. చరణ్ – నాగ్ అశ్విన్ ఈ కాంబో కూడా క్రేజీగానే ఉంటుంది. అందులో డౌటే లేదు.