పోస్టర్ మీద ఐదు భాషలు పేర్లు రాసి ‘పాన్ ఇండియా మూవీ’ అని వేసుకోవడం చాలా సింపుల్. కానీ నిజంగా పాన్ ఇండియా సినిమాగా తయారు చేయడం చాలా కష్టం. కల్కి విషయంలో ఆ కష్టం పడ్డాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి ని పాన్ వరల్డ్ స్థాయిలో తీసుకెళ్లాలని మొదటి నుంచి తపించాడు నాగీ. ఆ విధంగా తన కార్యచరణ రూపొందించుకున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన కల్కి ట్రైలర్ చూస్తే చాలా సర్ ప్రైజ్ లు కనిపించాయి. అందులో ఒకటి.. ఎవరి పాత్రకు వారే డబ్బింగ్ చెప్పుకోవడం. అమితాబ్, కమల్, దీపిక.. వీరంతా సొంత గొంతుకతో తెలుగు డబ్బింగ్ చెప్పడం.. చాలా బావుంది.
నిజానికి ఇలా భాష తెలియనివారితో ఇంతపెద్ద సినిమాకి కొత్తగా భాషని నేర్పించి డబ్బింగ్ చెప్పించాలంటే గట్స్ కావాలి. ఈ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాడు నాగీ. ముఖ్యంగా ట్రైలర్ లో దీపిక చెప్పిన డబ్బింగ్ కొంచెం పెక్యులర్ గానే వుంది. కానీ బావుంది. మాట్లాడుతున్నది దీపికనే, అది ఆమె పోషించిన పాత్ర తలూకు సొంత గొంతుకనే అనే ఫీలింగ్ ని కలిగించడం మెచ్చుకోదగ్గ అంశం. ఇదే కాదు.. సినిమా విడుదలయ్యే ప్రతి భాష విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నాగీ. డబ్బింగ్ బొమ్మలా కాకుండా ఒరిజినల్ టచ్ ఇవ్వడానికి తను తీసుకున్న కేర్ అభినందనీయం.