“బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలియదు” అంటూ నాగబాబు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఎవరో తెలియదని ఎలా అంటావ్ అంటూ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా లో నాగబాబు పై విరుచుకు పడుతుంటే, ఆ మధ్య బాలకృష్ణ “పవన్ కళ్యాణా? అతను ఎవరో నాకు తెలియదు ” అంటూ వ్యాఖ్యానించాడు కాబట్టి దానికి టిట్ ఫర్ టాట్ లాగా నాగబాబు ఇలా వ్యాఖ్యానించడం సబబే అంటూ మెగా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరొక సారి బాలకృష్ణ ను బీభత్సంగా కామెడీ చేసిపారేశాడు నాగబాబు.
నిన్న బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ తాను ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని, అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఎవరో మీకు తెలియక పోవడం ఏంటి అంటూ కొంతమంది తనను అడిగారని, అయితే తాను పొరపాటున అలా చెప్పానని, బాలకృష్ణ ఎవరో తనకు తెలుసు అని వ్యాఖ్యానించాడు నాగబాబు. ఇక్కడిదాకా వీడియో చూసిన వాళ్ళకు నాగబాబు తనను తాను సర్దుకుంటున్నాడు ఏమో అనిపించింది కానీ ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు.
“బాలకృష్ణ గారు మంచి నటుడు, ముఖ్యంగా ఆయన పెద్ద కమెడియన్, ఆయన అంత చక్కగా హాస్యం పండించే వారు చాలా అరుదుగా ఉంటారు. అటు ఆంగికం లో కానీ ఇటు అభినయంలో కానీ ఆయన మనల్ని కడుపుబ్బ నవ్విస్తారు. అలాంటి గొప్ప హాస్య నటుడు అయినటువంటి బాలకృష్ణ గారు తెలియదు అనడం పొరపాటే. పైగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ తో కలిసి కూడా నటించాడు” అని చెబుతూ పాతకాలంలో అంజి గాడు గా పేరొందిన కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫోటో ని చూపించాడు నాగబాబు. కృష్ణ గారు నటించిన అసాధ్యుడు సినిమా లో కూడా వల్లూరి బాలకృష్ణ గారు మంచి హాస్యాన్ని పండించారు అని చెబుతూ నాగబాబు మరొకసారి నందమూరి బాలకృష్ణ ను కెలికారు.
గతంలో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలకు టిట్ ఫర్ టాట్ లాగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పటికైతే అందరికీ అర్థం అయింది. అదేవిధంగా జనసేన అభిమానులను పరోక్షంగా ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ ‘అలగాజనం’, ‘సంకరజాతి ‘ అంటూ వ్యాఖ్యానించాడు అని పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య తరచుగా సభలలో చెబుతున్నాడు. బాలకృష్ణ గతంలో తమ మీద చేసిన వ్యాఖ్యలు అన్నింటికీ ఉద్దేశపూర్వకంగానే మెగా బ్రదర్స్ కసి తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
https://www.facebook.com/NagaBabuOfficial/videos/620266181782361/