జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నాగబాబు సోషల్ మీడియాను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నాలుగైదు రోజులుగా ఆయన ఎడతెరిపి లేకుండా వర్చవల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతుల, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా జనసైనికులతోనూ మాట్లాడుతున్నారు. పార్టీ బలోపేతం.. నేతల మధ్యనున్న గ్యాప్.. స్థానికంగా ఉన్న సమస్యలపై వర్చువల్ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా టీంకు .. ఆయన చాలా సూచనలు చేస్తున్నారని అంటున్నారు.
జనసేన గతంలో ప్రత్యకంగా సోషల్ మీడియా టీంను నిర్వహించేది. ఎన్నికల తర్వాత ఆ బడ్జెట్ సమస్యలతో వారిని తొలగించారు. కానీ పార్టీ కోసం పని చేసేవారు పెద్ద ఎత్తున ఉంటారు. వారంతా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారికి పార్టీ తరపు నుంచి గైడ్ లైన్స్ ఉండదు. తమకు ఎవరు వాదన పెట్టుకుంటారో వారి పార్టీకి వ్యతిరేకంగా వారి నాయకులుకు వ్యతిరేకంగా చెలరేగిపోతూంటారు. జనసైనికులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అది ఇతర పార్టీల్ని తిట్టడానికే అన్నట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చాలని నాగబాబు అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
పార్టీ లైన్ ప్రకారమే సోషల్ మీడియా సైనికులు ఉండేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పవన్.. జనసైనికులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు.. వాటి ప్రకారం .. ఎవరూ గీత దాటకుండా చూడాలనుకుంటున్నారు. కారణం ఏదైనా… నాగబాబు ముందుగా వర్చువల్ మీటింగ్ ల ద్వారా పార్టీలో ఉన్న లోపాలను సవరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తర్వాత జిల్లాల పర్యటనలకు వెళ్లే చాన్స్ ఉంది.