టాలీవుడ్ లో మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే శర్వానంద్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. వరుణ్ పెళ్లి ఫిక్సయ్యిందన్నది టాలీవుడ్ టాక్. దీనిపై నాగబాబు కూడా హింట్ ఇచ్చారు. “త్వరలోనే వరుణ్ పెళ్లి ఉంటుంది. పెళ్లి కూతురు ఎవరు? పెళ్లెప్పుడు? అనేది వరుణ్ తేజ్స్వయంగా చెబుతాడు“ అంటూ తేల్చేశారు నాగబాబు. తన పిల్లలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చానని, జీవితంలో ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకొంటారని చెప్పుకొచ్చారు మెగా బ్రదర్. దీన్ని బట్టి.. వరుణ్తి లవ్ మ్యారేజ్ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వరుణ్ కి ఇప్పుడు 33 ఏళ్లు. వరుణ్ కంటే వయసులో సాయిధరమ్ తేజ్ పెద్దోడు. తనకింకా పెళ్లి కాలేదు. అల్లు శిరీష్‌కి 35 ఏళ్లు. తన పెళ్లి వార్త కూడా త్వరలో చెబుతామని ఈమధ్యే అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక.. తేజూకి కూడా సెట్టయితే ఈ యేడాదంతా మెగా పెళ్లిళ్లే!