పవన్ కల్యాణ్ సోదరరుడు నాగబాబు లేదు లేదంటూనే అనకాపల్లిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేిస మూడో స్థానంలో నిలిచిన ఆయన ఆ తర్వాత తాను ఇక ఎన్నికల బరిలోకి నిలిచేది లేదని చెప్పారు. ఇప్పుడు టీడీపీ, జనేసన కూటమి తరపున అనకాపల్లిలో నిలబడేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఈ అంశంపై ఆయన ఏమీ చెప్పడం లేదు. పార్టీ అధినే్త ఆదేశం మేరకే పోటీ చేస్తానని అంటున్నారు.
అయితే అనకాపల్లి లోక్ సభ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యలమంచిలిలో ఇల్లు కూడా తీసుకున్నారు. తన సిబ్బంది కోసం కూడా కొన్ని ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ కోసమే సన్నాహాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందన్న నమ్మకంతో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. అయితే ఇప్పుడు నాగబాబు పోటీ రావడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. దీంతో స్వయంగా కొణతాల ఇంటికి వెళ్లి నాగబాబు మాట్లాడి వచ్చారు.
ఇంకా అధికారికంగా సీట్ల సర్దుబాుట పూర్తి కాలేదు. బీజేపీ కూడా పొత్తుల రేసులో మేమున్నామంమటూ ముందుకు వస్తోంది. అందరికీ సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంది. ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా అన్నీ పార్టీలకు కలిపి .. ఓ లెక్కకు మించి ఇవ్వకూడదని టీడీపీ అనుకుంటోంది. ఈ క్రమంలో ఎ సీట్లు ఏ పార్టీకి వస్తాయో స్పష్టత లేదు. అయినా నాగబాబు మాత్రం ఈ సారి పార్లమెంట్ కు వెళ్తానన్న ధీమాతో అనకాపల్లిలో సన్నాహాలు చేసుకుంటున్నారు.