జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత పార్టీ పెట్టకుండా.. తెలుగుదేశం లేదా బీజేపీల్లో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని ఆయన సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ గురించి ఆయన అభిమాని ఒకరు పూర్తిగా చేత్లో రాసిన పుస్తకం రియల్ యోగిని నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పదవుల కోసం పార్టీ పెట్టలేదని.. ప్రజలకు మంచి చేయానే పార్టీ పెట్టారన్నారు. లంచగొండితనం.. అవినీతిని నిలదీయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని స్పష్టం చేశారు.
వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. ఏపీలో ఎలా తిరగనివ్వరో చూస్తామనిహెచ్చరించారు. గత 30 ఏళ్ల క్రితం నా తమ్ముడు ఎలా ఉన్నాడో..ఇప్పుడు కూడా అలాగేఉన్నాడని డబ్బుల కోసం..పదవుల కోసం వెంపర్లాడేవాడు కాదనిస్పష్టంచేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై విమర్శలు చేయటం బాధాకరమని సినిమాల్లో పవన్ కు కోట్లు కురుస్తాయి… సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బంతా పట్టుకొచ్చి జనసేన పార్టీకే పెట్టాడన్నారు.
పవన్ కల్యాణ్ కన్నా తక్కువ సంపాదించే హీరోల వద్ద కోట్లు ఉంటాయని..కానీ పవన్ కల్యాణ్ వద్ద మాత్రం ఉండవన్నారు. సంపాదించేది మొత్తం పార్టీకే పెడుతున్నారని నాగాబు చెప్పారు. ఆఖరికి పిల్లల చదువుల కోసం దాచిన డబ్బులు కూడా పార్టీ కార్యక్రమాల కోసమే పెడుతున్నాడని ..కరడు కట్టిన కర్కశత్వం కలిగిన గూండాల్లాంటి రాజకీయ నాయకులతో పోరాడుతున్నాడని నాగబాబు అన్నారు. ఆయనను చూసి తమ కుటుంబం గర్వ పడుతోందన్నారు.