మెగా బ్రదర్ నాగబాబు… సొంత యూట్యూబ్ చానల్లో… తనకు నచ్చని వారిపై సెటైర్లు వేస్తూ కాలం గడపడం లేదు. తమ్ముడికి అండగా.. రంగంలోకి దిగారు. తన రాజకీయ అనుభవాన్ని మొత్తం జనసేనకు ఉపయోగించేందుకు… పరోక్షంగా రంగంలోకి దిగారు. ముందుగా… తమకు పట్టు ఉన్న గోదావరి జిల్లాలపైనే దృష్టి పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడురోజుల పాటు ఆయన రహస్యంగా పర్యటించారు. మెగా అభిమానులతో పాటు.. జనసేనలో క్రియాశీలకంగా ఉన్న కొంత మందితో.. సమావేశం అయ్యారు. అయితే ఇవన్నీ క్లోజ్డ్ డోల్ మీటింగ్లే. ఎక్కడా హడావుడి బయటపడనీయలేదు. కానీ.. జనసేన కోసమే.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని ఎలా బలపేతం చేయాలి.. వచ్చే ఎన్నికల కోసం.. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నది ఆ సమావేశాల సారాంశమని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయంలోనూ.. నాగేంద్రబాబు.. ఇలాంటి సాయమే చేశారు. పీఆర్పీ అనుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి అభిమానులందరికీ సందేశం ఇచ్చి… వారి మద్దతు పొందేందుకు.. నాగేంద్రబాబు.. చాలా కష్టపడ్డారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ పర్యటించారు. అభిమానులందర్నీ ఏకం చేశారు. చిరంజీవి పార్టీ పెట్టబోతున్నారన్న అంశం… ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి.. వారి స్పందనను తెలుసుకోవడానికి.. నాగేంద్ర బాబు పర్యటనలు బాగా ఉపయోగపడ్డాయి. తనకు ఇచ్చిన పనిని నాగబాబు సమర్థంగా నిర్వర్తించారు. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా… చిరంజీవిపై బంధుప్రీతి విమర్శలు వస్తాయని.. వెనుకడుగు వేశారు. అయితే.. జనసేన పార్టీ ప్రారంభోత్సవం విషయంలో..నాగబాబుకు ఎలాంటి పాత్రా లేదు. కానీ ఇప్పుడు మాత్రం రంగంలోకి దిగారు.
జనసేన పార్టీ కోసం.. నాగబాబు.. మరికొన్ని జిల్లాల్లో తిరుగుతారని.. మెగా అభిమానుల్ని ఏకతాటిపైకి తేవడం.. గతంలో పీఆర్పీ కోసం పని చేసిన వారిని.. మళ్లీ జనసేనలో యాక్టివ్ అయ్యేలా చూడటం వంటి పనుల్ని చూస్తారని చెబుతున్నారు. పార్టీ నిర్వహణ పవన్ కల్యాణ్ ఒక్కరికే కష్టంగా ఉంది. అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోలేకపోతున్నారన్న అభిప్రాయం జనసేలోనే ఉంది. నాగబాబు అయితే కొంత వరకు సమన్వయం చేయగలరని.. అందుకే ఆయన్ని రంగంలోకి దించారని చెబుతున్నారు. కొద్ది రోజుల కింట.. నాగబాబు, వరుణ్ తేజ్ .. జనసేనకు విరాళం ప్రకటించిన సందర్భంలో.. తాము.. జనసేనకు ప్రత్యక్షంగా సేవ చేయలేకపోతున్నామని.. బిజీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కానీ నాగబాబు ఇప్పుడు తీరిక చేసుకుని జనసేన కోసం పని ప్రారంభించారు.