అనకాపల్లి పార్లమెంట్ సీటును జనసేనకే కేటాయించారు. ఇంతకు ముందు కాకినాడ, మచిలీపట్నం కేటాయించారు. తాజాగా మూడో సీటును కూడా కేటాయించినట్లుగా స్పష్టమయింది. ఆ సీటు అనకాపల్లి ఎంపీ సీటు అని చెబుతున్నారు. ఈ సీటు కోసం టీడీపీలో చాలా పోటీ ఉంది. చింతకాయల విజయ్ ఈ సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే బైరా దిలీప్ చక్రవర్తి అనే లీడర్ ను చంద్రబాబు ఖరారు చేశారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీటు నాగబాబు ఖాతాలోకి వెళ్లిపోయింది.
మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి నుంచి నాగబాబాబు పోటీ చేస్తారు. కాకినాడ సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తే .. మరో పార్లమెంట్ సీటును కేటాయించే అవకాశం ఉంది. నాగబాబు గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. గతంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్.. పీఆర్పీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు.
కానీ ఈ సారి మాత్రం.. గట్టిగా విజయావకాశాలు ఉంటాయి. పొత్తులో భాగంగా టీడీపీ మద్దతు ఉండటం… సామాజికవర్గ పరంగా కూడా.. సానుకూంగా ఉండటంతో… ఎంపీ నాగబాబు అనే ట్యాగ్ రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సీటును ఆశించిన కొణతాల రామకృష్ణకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు.