జనసేన పార్టీ జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకుంది. పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు నాగేంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. తొలి సారిగా పుంగనూరు నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేశారు. మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడం అనూహ్యమే అనుకోవచ్చు.
జనంలోకి జనసేన .. నాగబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటినీ నాగబాబే పర్యవేక్షించనున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకోవడం దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించనున్నారు. పవన్ కల్యాణ్ పాలనలో భాగంగా నెలలో పదిహేను రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని అనుకుంటున్నారు.
నాగబాబు కూడా వచ్చే నెలలో మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ లోపే పలు నియోజకవర్గాల్లో జనంతో జనసేన నిర్వహించనున్నారు. ముఖ్యంగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ముందుగా ఈ బహిరంగసభలను పూర్తి చేసే అవకాశం ఉంది.