” ఆరెంజ్ సినిమాతో వచ్చిన నష్టాల కారణంగా.. ఆర్థిక ఇబ్బందుల్లో పడి.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాకు..నా కుటుంబానికి జబర్దస్త్.. అన్నం పెట్టింది..” అని ఏ మాత్రం.. మొహమాటపడకుండా… ఆ షోపై తన కృతజ్ఞతను ఇన్నాళ్లు చాటిన… నాగబాబు.. ఆ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా… ఉపయోగించుకోవడం వదిలి పెట్టడం లేదు. ఓ కరంగా.. ఆ షో క్రెడిట్ అంతా.. తనే క్లెయిమ్ చేసుకుంటూ.. తన యూ ట్యూబ్ చానల్లో… రెగ్యులర్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. అసలు జబర్దస్త్ ఎలా ప్రారంభమయింది.. అందులో తన హీరోయిక్ పాత్రమేటి.. అన్న విషయాలతో.. సిరీస్ ప్రారంభించారు. తాను ఎందుకు బయటకు వచ్చానో చెప్పడానికి.. అసలు ఈ కథ ప్రారంభించారన్న మాట.
మరో నాలుగైదు వీడియోలు పెట్టిన తర్వాత.. జబర్దస్త్ యాజమాన్యంపై.. కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసి.. మరింత పాపులారిటీని నాగబాబు సంపాదించుకుంటారని.. తన యూట్యూబ్ చానల్.. నా ఇష్టంకు.. క్రేజ్ పెంచుకుంటారని.. సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్లు పడుతున్నాయి. నాగబాబు.. నా ఇష్టం పేరుతో.. యూ ట్యూబ్ చానల్ నడుపుతున్నారు. గతంలో.. రాజకీయంగా వేడి ఉన్నప్పుడు.. ఆయన టీడీపీ, వైసీపీపై.. స్కిట్లు వేసి అందులో పెట్టేవారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసేవారు. దాంతో.. ఆ చానల్ సబ్స్క్రయిబర్లు… వ్యూయర్ షిప్ కూడా పెరిగింది. ఎన్నికల తర్వాత ఏం చేయాలో నాగబాబుకు అర్థం అయినట్లు లేదు. కొన్ని అంశాలపై వీడియోలు పెట్టినప్పటికీ.. పెద్దగా క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు.. తను వదిలేసిన జబర్దస్త్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు.
సాధారణంగా.. ఏ కారణం చేత అయినా… ఓ షోను వదిలేసుకున్న తర్వాత ఆ షో గురించి మాట్లాడటానికి.. ఎవరూ ఇష్టపడరు. పైగా.. తన ఇష్ట ప్రకారం.. చేయడం లేదన్న కారణంగా..నాగబాబు బయటకు వచ్చేశారు. అక్కడ పని చేస్తున్న వారిలో..వచ్చినంత మందిని తన వైపు తీసుకెళ్లిపోయారు. అలాంటి సమయంలో.. ఇక ఆ షో గురించి మాట్లాడకూడదు. కానీ.. అక్కడేదో తనకు అన్యాయం జరిగిపోయిందన్న ఫీలింగ్ కల్పించడానికి నాగబాబు.. తన యూట్యూబ్ చానల్ వీడియోను వాడుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ వీడియోలో.. తన స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వలేదని… వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ.. తన కుటుంబాన్ని ఆదుకుందని చెబుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడు.. తన రేంజ్ కు తగ్గట్లుగా డబ్బులు ఇవ్వలేదని చెప్పడం.. చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో ఆయన వీడియోల్లో ఇలాంటి కాంట్రావర్శీలు కొన్ని ఉంటాయి. అవి మంచి వ్యూస్ తెచ్చుకుంటాయని అంటున్నారు. అలా.. జబర్దస్త్ ను.. వదిలేసిన తర్వాత కూడా నాగబాబు వాడుకుంటున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.