ఈ వారంలో చాలా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ప్రెస్ మీట్ నాగచైతన్య ‘తండేల్’. ఈ సినిమాకి సంబంధించి మొదటి ప్రెస్ మీట్ఇది. అల్లు అరవింద్,బన్నీవాస్, డైరెక్టర్ చందు, హీరోయిన్ సాయి పల్లవి, హీరో నాగచైతన్య.. ఇలా టీంలో కీలక సభ్యులందరూ వచ్చి మీడియా ముందు ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా వస్తోంది.
ప్రెస్ మీట్ లో సినిమా గురించి సభ్యులంతా మాట్లాడారు. అయితే మీడియా సర్కిల్ ఎంతగానో ఎదురు చూసిన క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ మాత్రం అనుకునేలా జరగలేదు. క్యూ అండ్ ఏ లో సాయి పల్లవి, నాగచైతన్య పాల్గొనలేదు. అలాగే దాదాపుగా ఒక గంట పాటు అయినా ఈ క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ 15 నిమిషాల్లో ఈ ప్రెస్ మీట్ ని పూర్తి చేశారు.
దీనికి కారణం ఉంది. రిలీజ్ డేట్ చెప్పడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. రిలీజ్ డేట్ చెప్పేశారు. మెసేజ్ కమ్యూనికేట్ అయింది. అల్లు అరవింద్ అక్కడి వరకే ఈ ప్రెస్ మీట్ ని పరిమితం చేశారు. అంతకుమించి క్యూ అండ్ ఏ లో నాగచైతన్య, సాయి పల్లవిని ఇన్వాల్వ్ చేస్తే సబ్జెక్టు కాస్త పక్కదారి పడుతుంది. ఆ సంగతి అల్లు అరవింద్ కి తెలియంది కాదు.
ఇటీవల సాయి పల్లవి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. అలాగే నాగచైతన్య పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా క్యూ అండ్ ఏ లో వస్తాయి. ఇవన్నీ కూడా తండేల్ సినిమాకి సంబంధం లేనివి. అందుకే అల్లు అరవింద్ చాలా తెలివిగా క్యూ అండ్ ఏ లో నాగచైతన్య సాయి పల్లవిని తప్పించేసారు. ఒక విధంగా ఇది మంచిదే. సినిమాపై మంచి బజ్ వుంది. ఇప్పుడు లేనిపోని ప్రశ్నలు అడిగి సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కంటే ఉన్న క్రేజ్ ను కాపాడుకొని పద్ధతిగా ముందుకు వెళ్లడమే మంచిది.