దేవదాసు…. ఏఎఎన్నార్ చిత్రాల్లో ఓ ఆణిముత్యం. అక్కినేని చేసిన పాత్రల్లో అజరామరం. దేవదాసు గా చాలామంది నటించారు.. కానీ… ఆ పాత్ర సూటైంది మాత్రం అక్కినేనికే. ఇప్పుడు అక్కినేని మనవడు నాగచైతన్య దేవదాసుగా మారిపోయాడు. `మహానటి` సావిత్రి కోసం. సావిత్రి జీవిత కథ ఆధారంగా `మహానటి` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేనిగా మనవడు నాగచైతన్య కనిపించనున్నాడు. చైతూ కనిపించేది రెండు మూడు సన్నివేశాలే. అయితే అందులో దేవదాసు గెటప్ కూడా ఉండబోతోంది. ఆనాడు ఏఎన్నార్ చేతిలో మందు సీసా, మెడలో కండువా, పక్కనకుక్కతో ఎలా కనిపించాడో.. ఇప్పుడు చైతూ అలా దర్శనమివ్వబోతున్నాడు. `మహానటి`లో నాగచైతన్య లుక్‌ని.. దేవదాసు రూపంలోనే విడుదల చేయబోతున్నారు. మే 9న మహానటి విడుదల కానుంది. ఈలోగా ఒకొక్క లుక్ బయటకు రానుంది. మరి దేవదాసు పాత్రలో చైతూ ఎలా సెట్టయ్యాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.