‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో అక్కినేని నాగచైతన్య ఎంతమంది హృదయాలను గెలుచుకున్నాడు అనేది పక్కన పెడితే… సక్సెస్‌మీట్‌లో స్పీచ్ మాత్రం ప్రేక్షకుల ఫిదా చేసింది! మారుతి దర్శకత్వంలో హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో 23 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. వసూళ్లు అయితే వచ్చాయి కానీ… విమర్శకుల్ని, కొంతమంది ప్రేక్షకుల్ని ‘శైలజారెడ్డి అల్లుడు’ మెప్పించలేకపోయిందనేది వాస్తవం. ఈ విషయాన్ని నాగచైతన్య అంగీకరించాడు. కొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినిమా ప్రముఖులు ప్రశంసలు తప్ప విమర్శల్ని స్వీకరించలేని స్థాయిలోకి వెళ్లారు. ఇటువంటి సమయంలో విమర్శకుల్ని సినిమాతో శాటిప్ఫై చేయలేకపోయానని సక్సెస్‌మీట్‌లో హీరో చెప్పడం నిజంగా గొప్ప విషయం. అంత నిజాయతీ నాగచైతన్యలో మాత్రమే చూడగలం ఏమో! శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సక్సెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ “సినిమా విడుదలైన రోజు ఉదయం కొంచెం డిజప్పాయింట్ అయ్యా. కొంతమంది రివ్యూయర్లను శాటిప్ఫై చేయలేకపోయా. ఐయామ్ సారీ. నెక్స్ట్ టైమ్, నెక్స్ట్ మూవీకి ఇంకా కష్టపడతా” అన్నాడు. ప్రేక్షకులు ఈ మాటలకు ఫిదా అయ్యారు. విమర్శల్ని అతను స్వీకరించిన తీరుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.