నాగచైతన్య టాప్ స్టారేం కాదు. తన సినిమాలు 40 – 50 కోట్ల బిజినెస్‌లు చేసిన దాఖలాలు లేవు. సినిమాపై ఎంత బజ్ వచ్చినా… ఈలోపే మార్కెట్ జరుగుతుంది. అయితే `లవ్ స్టోరీ` మాత్రం ఈ హద్దుల్ని దాటేస్తోంది. తన కెరీర్లో ఎప్పుడూ చూడని అంకెలు చైతూ తొలిసారి చూస్తున్నాడు. ఈ సినిమాని ఆంధ్రాలో 15 కోట్లకు అమ్మేశారు. చైతూ కెరీర్లో ఇదే రికార్డు. ఓవర్సీస్ ఆరు కోట్లు పలికింది. అదీ రికార్డే. నైజాంలో ఓన్ రిలీజ్. అమ్మితే.. ఇక్కడా మంచి రేటే పలికేది. మొత్తానికి చైతూ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. అయితే.. ఇదంతా శేఖర్ కమ్ముల, సాయి పల్లవిల క్రేజ్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వరకు వీళ్ల కాంబినేషన్లో `ఫిదా` వచ్చింది. ఆ క్రేజ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఇది సాయి పల్లవి సినిమాగానే ప్రమోట్ అవుతూవచ్చింది. ఆదివారం విడుదలైన పాటతో అయితే.. ఆ ముద్ర మరింత బలంగా నాటుకుపోయింది. ఏదైతేనేం..? ఈ స్ట్రాటజీ.. చైతూకి కలిసొచ్చినట్టే. `ఫిదా`లో సాయి పల్లవికి మంచి పేరొచ్చినా, వరుణ్‌తేజ్ కూడా తనదైన మార్క్ చూపించగలిగాడు. ఈసారీ అదే జరగొచ్చు. బొమ్మ హిట్టయితే.. ఆ క్రెడిట్ చైతూ ఖాతాలోకీ వెళ్తుంది. కాబట్టి.. చైతూ కూడా `ఇది సాయి పల్లవి సినిమా అనుకుంటారా?` అనే టెన్షన్ లేకుండానే.. ఈ క్రేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు టాక్.