టాలీవుడ్లో అగ్రగామి నిర్మాణ సంస్థగా దూసుకెళ్తోంది యూవీ క్రియేషన్స్. సాహోని దాదాపు 300 కోట్లతో తెరకెక్కిస్తోంది. ఈ అంకెలు చాలు.. యూవీ స్టామినా ఏమిటో చెప్పడానికి. ఈ సంస్థలో ప్రభాస్‌కీ వాటా ఉంది. ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి యూవీ ప్లాన్ చేస్తోంది. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి పనిచేస్తారు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయింది. నాగచైతన్య డేట్ల కోసం మేర్లపాక గాంధీ ఎదురుచూస్తున్నాడు. యూవీలో ఓ సినిమా చేయాలని చైతూ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. దాంతో ఈ ప్రాజెక్టు సెట్టయిపోయింది. అయితే నాగచైతన్య ఇప్పుడు చాలా బిజీ. వెంకీమామ సెట్స్‌పై ఉంది. అది పూర్తయ్యాక `బంగార్రాజు` సీక్వెల్ మొదలవుతుంది. వీటి మధ్య గాంధీకి డేట్లు ఇవ్వగలడో లేదో చూడాలి. ఒకవేళ చైతూ బిజీగా ఉంటే ఈ ప్రాజెక్టుని మరో యువ హీరోతో పట్టాలెక్కించేయాలని గాంధీ భావిస్తున్నాడు. కానీ యూవీకి మాత్రం గాంధీ స్క్రిప్టుని చైతూతోనే చేయాలని వుంది. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?