నాగార్జున కొడుకులు ఇద్దరిలో నాగ్ చైతన్య కు మంచి మార్కులు పడతాయి ఇండస్ట్రీలో. ఎవర్ని అడిగినా ఫుల్ పాజిటివ్ గా చెబుతారు చైతూ గురించి. ఈ సంగతి అలా వుంచితే చైతన్యకు నిర్మాణ వ్యవహారాలు కూడా నేర్పాలని నాగ్ కు మొదట్నించీ వుంది. ఎందుకంటే స్టూడియో వుంది. బ్యానర్ వుంది. పైగా తను, కొడుకులు కలిసి పెట్టుకున్న కొత్త బ్యానర్ మనం ఎంటర్ ప్రైజెస్ వుండనే వుంది. అందుకే గతంలోనో ఓ సినిమాకు పూర్తి నిర్మాణ బాధ్యతలు చైతన్యకు అప్పగించాడు.
ఇటు తన సినిమాల ప్లానింగ్, వాటిపై తండ్రితో పెర్ ఫెక్ట్ డిస్కషన్ తో పాటు అదనపు వ్యవహారాలు కూడా చూడడం ప్రారంభించాడట చైతన్య. తన కజిన్ సుశాంత్ తో రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న చి.ల.సౌ సినిమాను చూసి, దాన్ని టేకొవర్ చేయాలన్న ప్లాన్ మొత్తం చైతన్యదే నట.
సినిమా చూసి, కాలుక్యులేషన్లు చేసి, వాళ్ల పెట్టిన పెట్టుబడి లెక్కలువేసి, ఆఖరికి నాలుగు కోట్లకు ఆ సినిమాను టేకోవర్ చేసారట. పైగా ఈ డీల్ లో టోటల్ నెగిటివ్ రైట్స్ అన్నపూర్ణవే. అందువల్ల పెద్దగా రిస్క్ లేదు. శాటిలైట్ రెండు కోట్లకు చేయించుకోగలిగినా, మూడు కోట్ల మేరకు థియేటర్ హక్కులు వుంటాయి. సో, నాగ్ చైతన్య లాభసాటి బేరమే చేసాడనుకోవాలి.