నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల అవుతుంది. ఆ తరవాత… కార్తీక్ దండు సినిమాని పట్టాలెక్కిస్తాడు. ‘విరూపాక్ష’ సినిమాతో ఆకట్టుకొన్నాడు కార్తీక్ దండు. ఈసారి కూడా ఓ మిథికల్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నాడు. కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నారు. అయితే.. ఆ తరవాత ఈ స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. మీనాక్షి చౌదరి, నాగచైతన్య కాంబో ఫ్రెష్‌గా ఉంటుందని ఆమెని తీసుకోవాలనుకొన్నారు. అయితే పారితోషికం విషయంలో కాస్త పేచీ వచ్చిందని పక్కన పెట్టారు. ఆ తరవాత శ్రీలీలని అనుకొన్నారు.
కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడన్న సంగతి తెలిసిందే. విరూపాక్ష సినిమాలో సుకుమార్ హ్యాండ్ వుంది. ఆయన వాటాదారు కూడా. ఈ సినిమా విషయంలోనూ సుక్కు జోక్యం చేసుకొంటున్నారే. ‘పుష్ప 2’ కోసం శ్రీలీల ఓ ప్రత్యేక గీతం చేసింది. అప్పుడే చైతూ పక్కన శ్రీలీల అయితే బాగుంటుందని సుకుమార్ సలహా ఇచ్చార్ట. దాంతో మీనాక్షిని పక్కన పెట్టి, శ్రీలీలని తీసుకొన్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల డేట్లు కాస్త డైలామాలో పడ్డాయి. అఖిల్ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆ సినిమా డేట్లతో చైతూ డుట్లు క్లాష్‌లో పడ్డాయట. దాంతో.. శ్రీలీలని పక్కన పెట్టి మళ్లీ మీనాక్షినే తీసుకొందామని ఆలోచిస్తున్నారు. కాకపోతే.. రెమ్యునరేషన్ విషయంలో మీనాక్షి కాస్త తగ్గాల్సివుంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్టు తరవాత మీనాక్షి తన రెమ్యునరేషన్ పెంచేసిందని తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత.. హీరోయిన్.. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాల్సివుంటుంది.