నాగచైతన్య… అక్కినేని వారసుడు! అంతేనా? దగ్గుబాటి వారసుడు కూడా! తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాల వారసత్వం వున్న ఏకైక కథానాయకుడు నాగచైతన్యే. తండ్రి నుంచి అక్కినేని కుటుంబ వారసత్వం… తల్లి నుంచి దగ్గుబాటి వారసత్వం వచ్చాయి. తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్…. ఇద్దరూ మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్నవారే. నటనలో ఎవరికి వారే సాటి. తండ్రి నటన గురించి, అందం గురించి చైతూ చాలా సందర్భాల్లో చెప్పాడు. మేనమామ వెంకటేశ్ నటన గురించి ఈరోజు ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో చెప్పాడు. ‘వెంకీమామ యాక్టింగ్‌లో మీకు నచ్చిందేంటి?’ అని అడిగితే.. కామేడీ టైమింగ్ అని చెప్పాడు. ‘‘వెంకీ మామ చిత్రాల్లో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ నాకు బాగా ఇష్టం. ఐ లవ్ హిజ్ కామెడీ టైమింగ్’’ అని చెప్పాడు. కె.ఎస్. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చైతూ తెలిపాడు. ఆ సినిమాలో వెంకీ, చైతూ మామా అల్లుళ్లగా కనిపించనున్న సంగతి తెలిసిందే.