సుమంత్ కథానాయకుడిగా నటించిన నరుడా డోనరుడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో తీసిన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఎంట్రీ మాత్రం ఆశ్చర్యపరిచింది. అవును… ఈసినిమాలో చైతూ ఓ మెరుపులాంటి పాత్రలో కనిపించాడు. చైతూ ఈ సినిమాలో నటించాడన్న సంగతి విడుదలకు ముందు దాచి పెట్టేసింది చిత్రబృందం. అందుకే… అందరికీ ఇదో సర్ ప్రయిజ్ ఎలిమెంట్ అయ్యింది.
అక్కినేని ఫ్యామిలీలో ఎవరు ఏ సినిమా చేసినా మరొకరు.. అందులో కనిపించడం ఈ మధ్య ఓ సంప్రదాయంగా మారింది. అఖిల్ తొలి సినిమాలో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆటాడుకుందాం రాలో.. నాగచైతన్య కనిపించాడు. ప్రేమమ్‌లో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సుమంత్‌కి చైతూ సహాయం చేశాడన్నమాట.
కథలో భాగంగా విక్కీ.. ఇక స్పెర్మ్ డొనేషన్ చేయడానికి ఇష్టపడడు. దాంతో ఆంజనేయులు మరో స్పెర్మ్ డోనర్ని చూసుకోవాల్సివస్తుంది. అప్పుడే నాగచైతన్య ప్రత్యక్షమవుతాడు. అంటే నాగచైతన్య రెండో డోనరుడు అన్నమాట. విక్కీ డోనర్ సినిమా సీక్వెల్‌ని చైతూతో తీసే సీన్ లేకపోవొచ్చు గానీ… ఈ సినిమాపై ఇంకొన్ని కొత్త వార్తలు పుట్టడానికీ, అక్కినేని అభిమానుల్ని ఖుషీ చేయడానికి చైతూ ఎంట్రీ దోహదం చేసింది.