లవర్ బోయ్ నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమా మజ్ను(వర్కింగ్ టైటిల్). మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమంకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సినిమా మొదలైనప్పుడు ప్రేమం తెలుగు టైటిల్ కూడా అదే పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసినా మధ్యలో ‘మజ్ను’ అనే టైటిల్ ప్రిఫర్ చేయడంతో దాన్ని ఫిక్స్ చేశారన్నారు. కింగ్ నాగార్జున విరహ ప్రేమకథ మజ్ను సినిమా మంచి విజయం దక్కించుకుంది. ఆ టైటిల్ పెడితే సినిమా గురించి ప్రేక్షకులు వేరే యాంగిల్ లో ఆలోచించే అవకాశం ఉందని.. మళ్లీ ఆ సినిమాకు ప్రేమం అనే పెట్టబోతున్నారట.
ఇదో ఓ లవ్ రొమాంటిక్ స్టోరీ కాబట్టి మరి మజ్ను అంటే సినిమాకు సూట్ అవుతుందో లేదో అని మలయాళ టైటిల్ ప్రేమంనే పెట్టేస్తున్నారట. నాగచైతన్య సరసన శృతి హాసన్ తో పాటుగా ప్రేమం సినిమాలో నటించిన భామలు అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మజ్నుకన్నా ప్రేమం అయితేనే బాగుంటుంది అనే పునరాలోచనలో పడ్డారట చిత్రయూనిట్ అందుకే సినిమా టైటిల్ గురించి ఏది కచ్చితంగా చెప్పట్లేదు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. రెండు సినిమాల ప్రమోషన్స్ కలిపి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.