‘మజిలి’, ‘నిన్ను కోరి’ లాంటి హృద్యమైన చిత్రాలు తెరకెక్కించాడు శివ నిర్వాణ. ఇటీవల వచ్చిన ‘ఖుషి’ యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మరో కథ రెడీ చేసుకొని, హీరోని వెదుక్కొనే పనిలో పడ్డాడు. చివరికి తనకు నాగచైతన్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాగచైతన్య – శివ నిర్వాణ కాంబో మరోసారి సెట్టయ్యింది. కథ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. 2024లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
నాగచైతన్యతో చందూ మొండేటి ఓ సినిమా రూపొందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. సాయి పల్లవి కథానాయిక. ఈ సినిమా కోసం చైతూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా ఒప్పుకోకూడదన్నది చైతూ ఆలోచన. అందుకే.. చందూ సినిమా పూర్తయ్యేంత వరకూ శివ కూడా ఎదురు చూడాల్సిందే. వచ్చే నెలలో చందూ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోగా శివ నిర్వాణ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటాడు.